ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖు నుండి రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాలలో మూడు వేల కిలో మీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెల్సిందే .గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న ప్రజావ్యతిరేకత పాలన…అధికార పార్టీ నేతలు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలు ..ప్రత్యేక హోదా పై అటు బీజేపీ ఇటు టీడీపీ పార్టీలు ఐదు కోట్ల ఏపీ ప్రజలను మోసం చేసిన తీరును ఈ పాదయాత్రలో ప్రజలకు వివరించనున్నారు .
అయితే జగన్ తలపెట్టిన ఈ పాదయాత్రను విఫలం చేయడానికి బాబు నేతృత్వంలోని టీడీపీ శ్రేణులు పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నారు .ఇందులో భాగంగా ఒకవైపు జగన్ పాదయాత్ర నిర్వహిస్తుండగా మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తూ ఏపీ లో ఉన్న అన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ లో జగన్ పాదయాత్ర కవరేజ్ ఇవ్వకుండా కేవలం అసెంబ్లీ సమావేశాలను లైవ్ ప్రసారం చేసే విధంగా అన్ని తెలుగు న్యూస్ ఛానల్స్ అధినేతలకు ఆదేశాలను జారిచేశారు .
అంతే కాకుండా ఒకవైపు పాదయాత్రలో భాగంగా టీడీపీ సర్కారు అవినీతిని బయటపెట్టడమే కాకుండా ప్రజలను మోసం చేస్తోన్న తీరును వివరిస్తూ వైసీపీ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నాడు .దిన్ని నిరుత్సాహ పరిచే విధంగా తమ ఆస్థాన మీడియా ద్వారా వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు అని వార్తలను ప్రసారం చేస్తూ వైసీపీ శ్రేణులలో నిరుత్సాహం కల్గించే విధంగా స్కెచ్ సిద్ధం చేస్తోన్నాడు బాబు .అయితే బాబు జగన్ పాదయాత్రను విఫలం చేయడానికి చేస్తోన్న కుట్రలను తిప్పికొట్టడానికి వైసీపీ శ్రేణులు సిద్ధమవుతూనే ఉన్నారు .