ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూలైలో అప్పటి ప్రభుత్వం పంచాయతీలకు సాధారణ ఎన్నికలను అప్పటి ప్రభుత్వం నిర్వహించింది. ఆ ఎన్నికలలో గెలిచిన సర్పంచుల పదవీకాలం ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది. వారి ఐదేళ్ల పదవీకాలం 2018 ఆగస్టు 1తో ముగియనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఇ(3ఎ) ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ప్రస్తుత పదవీకాలం ముగియకముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుంది.
సెక్షన్ 13(2) ప్రకారం గడువు కన్నా మూడు నెలలు ముందుగానే ఎన్నికలను నిర్వ హించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికా రాలున్నాయి. రాజ్యాంగం కల్పించిన వెసులు బాటు మేరకు గడువుకన్నా ముందుగానే ఎన్ని కల ప్రక్రియను చేపట్టేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. పోలింగ్ సిబ్బంది, బ్యా లెట్ బ్యాక్సుల లభ్యత మేరకు వివిధ దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ నిర్ణ యించింది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకోవడం కోసం షెడ్యూల్ కూడా రూపొందించింది.
డిసెంబర్ కల్లా పునర్విభజన
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, వార్డుల పునర్విభజన ప్రక్రియను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు అవసరమైన పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, పోలింగ్ నిమిత్తం అవసరమైన సామగ్రి సేకరణ, రవాణా సదుపాయాలను సమకూర్చుకోవాలని కమిషనర్‌కు సూచిం చింది. బడ్జెట్ అంచనాలను రూపొందించి అవసరమైన మేరకు నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖను కోరింది.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించి.. గ్రామ పంచాయతీలో వార్డుల సంఖ్యకు సమానంగా పోలింగ్ స్టేషన్లు ఉండాలని, ప్రతి వార్డులో ఒక పోలింగ్ స్టేషన్ తప్పని సరని పేర్కొంది. పోలింగ్ స్టేషన్ సైజును బట్టి అవసరమైన సిబ్బందిని నియమిం చుకోవాల్సి ఉంటుంది. 200 మంది ఓటర్లున్న పోలింగ్ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు ఒక పోలింగ్ అధికారి, 400లోపు ఓటర్లు ఉంటే ఇద్దరు, ఆపైన ఉంటే ముగ్గురు పోలింగ్ అధికారులు తప్ప నిసరని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా, డివిజన్ స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేసి, తమకు నివేదిక పంపాలని సూచించింది.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
మార్చితో పాఠశాలల్లో పరీక్షలు పూర్తి కావడం, నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేందుకు జూన్ రెండో వారం వరకు సమయం ఉండటంతో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను 2018 మే నెలలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2017 నవంబర్ 30కల్లా గ్రామ పంచాయతీల జాబితా ఖరారు చేసి, డిసెంబర్‌కల్లా వార్డుల పునర్విభజనను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఏప్రిల్ 16లోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోరింది. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించడం, ముద్రణ పనులను మార్చి 15కల్లా పూర్తి చేస్తామని తెలిపింది. ఏప్రిల్. 17లోగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, మే 31లోగా ఎన్నికల నిర్వహణను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ వెల్లడించారు.