బుల్లితెరపై హాట్ గా యాంకరింగ్ పాటు మత్తెక్కించే మాటలతో రచ్చ చేసే శ్రీముఖి వెండితెరపై ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీతో టాప్ లెపెందుకు రెడీ అయ్యింది. ప్రముఖ స్టోరీ రైటర్, నటుడు హర్షవర్దన్ తొలిసారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1980లలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈమూవీ ట్రైలర్‌ను శ్రీముఖి ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.