చంద్రబాబు సర్కార్ ఏపీని అనారోగ్య రాష్ట్రంగా మార్చేసిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించారు. నారాయణ, చైతన్యలకు పరిమితి మించి హాస్టల్స్‌ను ఎలా మంజూరు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి పదవిలో ఉన్న గంటా శ్రీనివాస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
