వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సారథ్యంలో.. వైఎస్ఆర్సీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన మంత్రి సుజయ్ కృష్ణకు గడ్డుకాలం మొదలైంది. మంత్రి సుజయ్ కృష్ణా రంగారావు టీడీపీలో ఇమడలేక పోతున్నారా..?, టీడీపీ నేతలతో ఆయనకు పొసగడం లేదా..? అన్న ప్రశ్నలకు వస్తున్న సమాధానాలే ఇందుకు నిదర్శనం. పై ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం ఇస్తున్నారు విజయనగరం జిల్లా వాసులు. విజయనగరం జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుందామని మంత్రి సుజయ్‌కృష్ణా రంగారావు ఎంత ప్రయత్నించినా.. అందులో విఫలమవుతూనే ఉన్నారు. దీనికి కారణం జిల్లా ఎమ్మెల్యేల నుంచి మంత్రికి వస్తున్న సహాయ నిరాకరణే. అంతేకాదు, అవకాశం దొరికినప్పుడల్లా కార్యకర్తల నుంచి ద్వితీయ స్థాయి నాయకుల వరకు సుజయ్ కృష్ణను నిలదీస్తున్నారు.
