గత కొన్ని రోజులుగా కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయముపై ఎట్టకేలకు మంత్రి గంటా శ్రీనివాసరావు కదిలారు. విశాఖ నగరంలోని నారాయణ-చైతన్య హాస్టళ్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్టళ్లలో ఉన్న పరిస్థితులు పరిశీలించి విద్యార్దులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని,అవసరమైతే కాలేజీ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడ వెనుకాడబోమని మంత్రి హెచ్చరించారు. ఈ నెల 16న రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సమావేశం కాబోతున్నట్లు తెలిపారు. ఇంటర్ బోర్డ్ పేర్కొన్న నిబంధనలను అన్ని కళాశాలలు విధిగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.అయితే 158 హాస్టళ్లకు అనుమతులే లేవని మీడియాలో వార్తలు వచ్చాయి.మంత్రి గంటా నిజంగానే చర్చలు తీసుకుంటారా?లేక ఉత్తుత్తి మాటలా? అని సోషల్ మీడియాలో సెటైర్ లు వేస్తున్నారు.
