ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన కరీంనగర్ ఎంపీ వినోద్ లేఖ రాశారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై జాప్యం చేయడం తగదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లయినా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అనేక హామీలు అపరిష్కృతంగా ఉన్నాయని వివరించారు. నియోజక వర్గాల పెంపునకు అవసరమైతే సెక్షన్ 26ని సవరించి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. లేఖకు కేంద్రం స్పందించకపోతే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.