ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడలో తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా విజయవాడ పరిధిలో గల బీఆర్టీసీ మధురానగర్ వంతనపై గుంతలు చూసిన సీఎం చంద్రబాబు అధికారులను మందలించారు. 24 గంటల్లోగా గుంతలు పూడ్చాలని సూచించారు. అంతేగాక తాను చెప్పిందే రాసుకోవాలంటూ అదికారులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. చెత్తను కాల్వలోకి వేయకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
