అనంతపురం జిల్లా నేతన్నలు చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అయితే, అనంతపురం జిల్లా ధర్మవరంలో నేతన్నలు చేపట్టిన నిరసన దీక్ష గత 30 రోజుల నుంచి కొనసాగుతున్నా పాలకులు పట్టించుకోకపోడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో తమకు అండగా ఉంటానని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు తమ సమస్యలను పరిష్కరించమని ఎన్ని సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా పట్టించుకోక పోవడం దారుణమని నేతన్నలు చంద్రబాబుపై పెదవి విరుస్తున్నారు. పవర్లూమ్స్ రాకతో భారీగా నష్టపోతున్నామని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేతన్నలను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా, ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు దీక్షలు చేపడుతున్న నేతన్నలను పరామర్శించారు. వారికి సంఘీభావం తెలిపారు. రానున్నది జగనన్న రాజ్యమని, జగనన్న పాలనలో నేతన్నలకు మంచి రోజులు వస్తాయని వైసీపీ నేతలు భరోసా ఇచ్చారు.