తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్‌తో సహా పలువురిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. కాగా, ఇవాళ జనగామలో ఆరో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను చేపట్టేందుకు టీజేఏసీ నిర్ణయించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అల్లర్లు చెలరేగుతాయన్న నేపథ్యంలో ఈ రోజు(శనివారం) ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు.
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే తాము స్ఫూర్తియాత్ర చేస్తున్నామని కోదండరామ్ ఈ సందర్భంగా అన్నారు. తమను హౌస్ అరెస్టు చేయడం బాధాకరమన్నారు. తమకు తెలంగాణ అమరవీరుల గొప్పతనాన్ని చాటి చెప్పే హక్కు లేదా? అని ప్రశ్నించారు.