రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చేవారం ఉత్తర కోస్తా ప్రాంతానికి వాయుగండం ప్రమాదం పొంచి ఉందనీ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 15వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత 48 గంటల్లో వాయుగుండంగా బలపడి వాయవ్యంగా పయనించనుందని వాతావరణశాఖ తెలిపింది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం అదే ప్రాంతం, ఇంకా దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతం వరకూ విస్తరించింది. ఈశాన్య అరేబియా సముద్రంలో మరో ఆవర్తనం ఉంది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి.
