వైఎస్ఆర్ కడప జిల్లాలో టీడీపీ నేతలకు మరో పరాభవం ఎదురైంది. కాగా, ఈ రోజు కడప 26వ వార్డులో టీడీపీ ఇంటింటికి కార్యక్రమం జరుగింది. కార్యక్రమం ప్రారంభంలోనే టీడీపీ నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వార్డులోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలోనే మీకు కార్యకర్తలు గుర్తుకొస్తారా..? మిగిలిన సమయాల్లో కార్యకర్తలు గుర్తుకు రారా? అంటూ టీడీపీ నేతలపై ఆ పార్టీ కార్యకర్తలే ప్రశ్నల వర్షం కురిపించారు. కార్యకర్తలను పట్టించుకోకుండా ఏ మొహం పెట్టుకుని వస్తారంటూ టాడీపీ నేతలను నిలదీశారు. దీంతో తమ పార్టీ కార్యకర్తలే విమర్శించడంతో.. టీడీపీ నేతలు అక్కడ్నుంచి వెనుదిరిగారు.
