ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు చెత్త కోసం ఆగడమేంటని అనుకుంటున్నారా..?. మీ ప్రశ్న అదే అయితే.. ఈ సమాధానం మీ కోసమే.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుసంధానంగా సీఎం చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేపట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో నేడు విజయవాడ నుంచి ప్రసాదంపాడు మీదుగా వెళ్తూ రైవస్ కాల్వ వద్ద చంద్రబాబు ఆగారు. కాల్వ గట్టు వెంబడి చెత్త, మురుగు ఉండటంతో తన కాన్వాయ్‌ని కాన్వాయ్‌ని అక్కడ ఆపారు. 9 గంటలవుతున్నా చెత్త ఎందుకు తొలగించలేదని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, విజయవాడ సమీపంలోని 29 గ్రామాలను వీఎంసీ పరిధిలోకి తీసుకోవాలని మున్సిపల్ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.