చిన్న చిన్న కారణాల వల్ల చాల పెద్ద తప్పులు జరుగుతాయి అనే ఉదాహరణ ఇదే. సౌదీఅరేబియాకు చెందిన యువకుడితో.. అదే ప్రాంతానికి చెందిన యువతికి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. వీరి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాసేపాగితే పెళ్లి కూడా పూర్తి అయ్యేది. ఇంతలో తన కుమార్తె ముచ్చట తీర్చాలని వధువు తండ్రి వరుడిని ఒక కోరిక కోరాడు. తన కుమార్తెను కారు డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కాబోయే అల్లుడిని కోరాడు.
అంతే.. అతనిపై అంతెత్తున లేచిన అల్లుడు తక్షణం పెళ్లి రద్దు చేసుకొని వెళ్ళిపోయాడు. ..మీ కూతురి కోరిక తీర్చడం నా వల్ల కాదని వరుడు తన కాబోయే మామకి తేల్చి చెప్పేసాడు. అంతే కాక పెళ్లి రద్దు చేసుకున్నాడు ఎంతమంది సర్దిచెప్పినా వరుడు వినిపించుకోకపోవడం విశేషం. కాగా.. గతవారం సౌదీ రాజు ప్రకటన చేసేంత వరకు, ప్రపంచ దేశాల్లో స్త్రీలు డ్రైవ్ చేయకూడని ఏకైక దేశంగా సౌదీఅరేబియా ఉండేది. అయితే.. సౌదీరాజు సాల్మన్ గతవారం 2018 జూన్ నుంచి సౌదీ అరేబియాలో మహిళలు కూడా డ్రైవింగ్ చేసేందుకు అనుమతినిస్తున్నామని ప్రకటించడంతో.. మహిళలు కూడా డ్రైవింగ్ చేసే వేళుసుబాటు కలిగింది. అయితే.. కారు డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఇవ్వాలని అల్లుడిని కోరినా.. తక్షణం పెళ్లి రద్దు చేసుకొని వెళ్లిపోవడం ఆసక్తిగా మారింది.
