విద్యుద్ఘాతంతో ముగ్గురు రైతులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా సంజామల మండల పరిధిలోగల మిక్కినేనిపల్లిలో ఈ రోజు చోటుచేసుకుంది. కాగా, మిక్కినేనిపల్లికి చెందిన ముగ్గురు రైతులు రోజూ లాగే.. ఈ రోజు కూడా పొలం పనులు చేసేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వ్యవసాయపొలం వద్ద మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లారు. మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో ఒకరికి కరెంట్ షాక్ తగిలింది. ఇలా ఒకరిని ఒకరు కాపాడే క్రమంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. విద్యుత్తే వారి పట్ల మృత్యువైంది. సంఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు.
