ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అయిన అమరావతిను అలా చేస్తా ..ఇలా చేస్తా అని ఏ దేశం వెళ్ళిన ఆ దేశ రాజధాని నగరంలా తయారుచేస్తాను అని గత మూడున్నర ఏండ్లుగా చెప్తోన్న సంగతి తెల్సిందే .అయితే రాష్ట్ర విభజన తర్వాత బాబు తీసుకున్న రాజధాని ప్రాంతం నిర్ణయం మీద మొదటి నుండి ఇటు మేధావులు, శాస్త్రవేత్తలుదగ్గర నుండి శివరామకృష్ణన్ కమిటీ వరకు అందరు బాబు సర్కారు నిర్వహించతలపెట్టిన ప్రస్తుత రాజధాని
ప్రాంతం అంత అనుకూలం కాదు అని తేల్చి చెప్పారు .
ఎందుకంటే రాజధాని ప్రాంతం ఎంచుకున్న స్థలం మూడు పంటలు పండే భూములుండడం, ప్రాంతాల మధ్య సమతుల్యానికి ఈ ప్రాంతం దూరంగా ఉండడంతో అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దని చెప్తూ వచ్చారు .ఎందుకంటే అనుకోకుండా భారీ వర్షాలు వస్తే, కొండవీటి వాగు పొంగి రాజధాని ప్రాంతంలో ఐదారు అడుగుల వరకు నీరు ముంచేస్తుందని సంబంధిత నిపుణులు హెచ్చరించారు. కానీ హఠాత్తుగా టీడీపీ అనుకూల పత్రిక నేడు శుక్రవారం రాజధాని ప్రాంతంపై ఒక భారీ నెగిటివ్ స్టోరీని ప్రచురించింది అని ఒక వార్త వైరల్ అవుతుంది .అదే ఏమిటి అంటే ప్రస్తుతం రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతానికి భూకంపాల ముప్పు ఉందని తొలి పేజీలోనే కథనాన్ని ప్రచురించి ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవల తరచూ రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు రావడాన్ని ప్రస్తావిస్తూ…. రాజధాని ప్రాంతంలో భారీ భవంతులు నిర్మించే అవకాశం ఉన్నందున భూప్రకంపనల ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాజధాని ప్రాంతానికి చెంతనే ఉన్న గన్నవరంలో గురువారం కొన్ని నిమిషాల పాటు భూప్రకంపనలు రావడం ప్రమాద సంకేతమేనని అభిప్రాయపడింది. 1993లో మహారాష్ట్రలోని లాతూరులో తీవ్ర స్దాయిలో భూకంపం వచ్చిన సమయంలో ఏర్పడిన భూమిలోపల పగుళ్లలో ఒక పెద్ద పగులు లాతూరు నుంచి ఒంగోలు వరకు ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారని వెల్లడించింది. దాని ప్రభావంతోనే ఏపీలో కూడా భూప్రకంపనలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారని ఉటంకించింది. ప్రస్తుతం అమరావతి జోన్ -3లో ఉన్న అంశాన్ని ప్రస్తావించింది. . అయితే ఈ కథనం వెనుక ఏమైనా రహస్యాలు దాగి ఉన్నాయో కాలమే నిర్ణయించాలి ..