త్వరలో దేశం మొత్తం వరంగల్ వైపు చూడనుంది. చారిత్రిక సంపద ,ఎన్నోకళలకు పుట్టినిల్లైన ఓరుగల్లు నగరం ఇప్పటికే ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. చెత్త…చెత్త…కాదు సద్వినియోగం చేసుకుంటే చెత్తకూడా ఉపయోగంలోకి వస్తుంది.ఈ నినాదం అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లలో వినిపిస్తోంది.కానీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక చెత్తనే కాదు మానవ వ్యర్ధాలను శుద్దీకరిస్తే వాటిని కూడా ఉపయోగించుకోవచ్చని మరికొన్ని రోజుల్లో వరంగల్ మహానగరపాలక సంస్థ నిజం చేయబోతుంది.దేశంలోనే మొదటి సారిగా వరంగల్ నగరంలోలోని అమ్మవారిపేటలో కోటీ 20 లక్షలతో మిలిండా బిలిగేట్స్ ఫౌండేషన్ సౌజన్యం తో ASCI వారి పర్యవేక్షణలో మానవ వ్యర్ధాల శుద్దీకరణ ప్లాంట్ కు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది .దీంతో నగర ఖ్యాతి విశ్వవ్యాప్తం కానుంది.ప్లంట్ నిర్మాణం పూర్తికాకముందే పలు రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారి వివిధ రాష్ట్రాల ప్రతినిధులు వఛ్చి ప్లాంట్ ను సందర్శిస్తున్నారు.ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రతినిధులు ప్లాంట్ ను సందర్సించారు. ఇప్పటికే స్మార్ట్ సిటీ ,హృదయ్ లాంటి పథకాల్లో స్థానం సాధించిన వరంగల్ మహానగరం ఇటీవల వరుస అవార్డులను అందుకుంది.ఈ ప్లంట్ ఏర్పాటు ద్వారా నగరానికి మరింత మేలు జరగనుంది.
మానవ వ్యర్ధాల శుద్దీకరణ కేంద్రం ప్రత్యేకతలు..
ఈ కేంద్రం ద్వారా ప్రతీ రోజు 20 వేల లీటర్ల వ్యర్ధాలను శుద్ధి చేయవచ్చు. ఎలాంటి కాలుష్యం లేకుండా దీని నిర్వహణ ఉంటుంది.శుద్ధిచేసిన వ్యర్ధపదార్ధాల తో సహజ ఎరువు తయారు అవుతుంది.వ్యర్థాల శుద్దీకరణ సమయంలో వెలువడే నీటితో పూలమొక్కలు పంపి ఒక గార్డెన్ లా తయారు చేయడం జరుగుతుంది.
ప్లాంట్ ఏర్పాటు దృష్ట్యా పరిసరప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న పంటలపై ఎలాంటి ప్రభావం చూపదు .ఇది పూర్తిగా పర్యావరణానికి చిన్న ముప్పు కూడా తలపెట్టదు.పర్యావరణ పర్యావరణ పరిరక్షణకు మానసివ వ్యర్ధాల శుద్దీకరణ కేంద్రం ఎంతో దోహదపడుతుంది.
ప్లాంట్ ఏర్పాటులో మేయర్ విశేష కృషి ….
మానవ వ్యర్ధాల శుద్దీకరణ ప్లాంట్ ఏర్పాటులో మేయర్ శ్రీ నన్నపునేని నరేందర్ విశేష కృషి చేశారు .నగర అభివృద్ధి లో భాగంగా నగరాన్ని ODF గా మార్చడమే కాకుండా మానవ వ్యర్ధాలను నగర శివార్లలో పడేస్తే ప్రజలు అనారోగ్యపాలవుతారని దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలని తలచి శుద్దీకరణ ప్లాంట్ నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.తన ఆలోచనకు వెంటనే కార్యాచరణ రూపొందించి ప్లాంట్ శంకుస్థాపనను గౌరవ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీ హరి గారితో జూన్ రెండున శంకుస్థాపన చేయడం జరిగింది.గౌర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు,మరియు పురపాలక శాఖామాత్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉంది.వారి సారథ్యంలో ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.నిరంతరం ప్లాంట్ ఏర్పాటుపై అధికారులతో సమీక్షలు చేస్తూ పనులు వేగవంతం అయ్యేలా కృషి చేస్తున్నారు.ప్లాంట్ పనులను నిరంతరం స్వయంగా పర్యవేక్షిస్తూ పరిశీలిస్తున్నారు.