మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏ ముహూర్తాన ఎనౌన్స్ చేసాడో గాని ఈ సినిమా విషయమై రోజు రోజుకి రచ్చ పెరిగిపోతూనే వుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో టీడీపీకి వ్యతిరేఖంగా ఏం చూపెట్టి కంపు చేస్తాడో అని టీడీపీ నేతలు హడలి చావడమే కాదు వర్మపై బెరింపులకు కూడా దిగారు. సినిమా ఎనౌన్స్ చేసినప్పవుడే రాజేంద్ర ప్రసాద్ లైన్ లోకొచ్చి వర్మ సినిమా చేస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలు బుద్ది చెబుతారని వాదించాడు. అయినా వర్మ వెనక్కి తగ్గకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ని వైసీపీ ఎమ్యెల్యే నిర్మిస్తున్నాడని అగ్గి రాజేసాడు. అలాగే రోజాకి ఒక పాత్ర ఇస్తానని అధికారికంగా మీడియాకి చెప్పాడు.
ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డ విషయం తెలిసిందే. రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకనే ఈ సినిమా తీస్తున్నారని, జగన్ జీవిత చరిత్రను సినిమా రూపంలో చూపిస్తే ఆయన పాదయాత్ర కూడా చేయలేరని అన్నారు. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చుక్కలు చూపించిన వర్మ ఇప్పుడు ఎమ్మెల్యే అనితకి కూడా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ ఎమ్మెల్యే అనిత : ఎన్టీఆర్ పైన వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించవద్దు
వర్మ: అనిత గారు, బయట తెలిసిన చరిత్ర వెనుక లోపలి అసలు చరిత్ర చూపించడమే నా అసలు సిసలు ఉద్దేశం
టీడీపీ ఎమ్మెల్యే అనిత : ఎన్టీఆర్ మహానుభావుడు.. ఆయన పేదలకు, ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలి.
వర్మ: అనితగారు.. ఈ సినిమా బయోపిక్ కాదు.. కేవలం లక్ష్మి పార్వతి గారు ఆయన జీవితంలో ప్రవేశించినప్పటినుంచీ తుది వరకూ
టీడీపీ ఎమ్మెల్యే అనిత : ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసినా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.
వర్మ : అనితగారు.., ఇలాంటి వార్నింగ్ లు టీడీపీ పుట్టకముందు నుంచి విని విని విసుగెత్తిపోయాను
టీడీపీ ఎమ్మెల్యే అనిత : రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే.. వైసీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు ఉంది..
వర్మ : లోగుట్టు పెరుమాళ్ళకెరుక
టీడీపీ ఎమ్మెల్యే అనిత : చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే.. బ్రతికి ఉన్న జగన్ పైన కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారు.. జగన్ జీవిత చరిత్ర ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే.. ఆయన పాదయాత్ర కూడా చెయ్యలేరు..
వర్మ : అనితగారు, మీరు సూపరు.. నాకు తెలిసి ఇలాంటి స్క్రిప్ట్ ఐడియా షోలే రైటర్ సలీమ్ జావేద్‌కి కాని, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా వచ్చిఉండదు
టీడీపీ ఎమ్మెల్యే అనిత : మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి… అదే సమాజహితం
వర్మ: ఆహా.. క్లాప్సు.. విజిల్స్..!
* ఇదండీ టీడీపీ ఎమ్మెల్యే అనిత.. రామ్ గోపాల్ వర్మ దంగల్ ఇన్ సోషల్ మీడియా..!