“పద్నాలుగేండ్ల అలుపెరుగని పోరాటం చేసి ఎన్నో అవమానాలను అవహేళనలను భరించి అన్నింటికి ఎదురుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తర్వాత అపజయం ఎరగకుండా విజయాలను వెంటపెట్టుకున్నారు.
2014 ఎన్నికల నుండి నిన్నటి సింగరేణి వరకు వెనుతిరిగి చూసిన దాఖలాలు లేవు.నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలను సైతం తన చాణక్యతో ఎదురుకుని ఘనవిజయం సాధించి హరీష్ రావు తనను తాను నిరూపించుకున్నారు.గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుకగా అందించారు కేటీఅర్ గారు.ఇక సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో ప్రతిపక్షాలన్ని ఏకమై ఒక కూటమిగా ఏర్పడిరాష్ట్ర నాయకులతోనే కాకుండా జాతీయ నాయకులతో పాటు టీపిసీసీ ఇంచార్జ్ కుంతీయా, సంజీవరావు లాంటి హేమాహేమీలను రంగంలోని దించి కేసీఆర్ పతనం సింగరేణితో మొదలు కావాలని విస్తృతంగా ప్రచారం చేసారు.
నిజానికి తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘంలో అంతర్గత కలహాలు రచ్చకెక్కి వీధీ పోరాటాలతో బలహీనమై ఈ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో గెలుపుకు సుదూరంగా ఉన్నా ఆ సంఘానికి గౌరవం అధ్యక్షురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని యూనియన్ నాయకుల మధ్య విభేదాలను తొలగించి 11 డివిజన్ల నాయకులందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి స్థానిక టీఆర్ఎస్ నాయకులను సమన్వయ పరిచి, పక్కా ప్రణాళికతో కార్మికుల అవసరాలను, కష్టాలను స్వయంగా తెలుసుకొని ఎన్నికల హామీలను వాటికి అనుగుణంగా సిద్దం చేసి ఎన్నికల ప్రచారంలో జాతీయ కార్మిక సంఘాలను, ప్రతిపక్ష కూటమిని ముచ్చెమటలు పట్టించడమే కాకుండా ఎన్నికల ఫలితాలకు ముందే ప్రత్యర్ధి పార్టీలు చేతులెత్తేసే విధంగా నాయకత్వ చాతుర్యం ప్రదర్శించడంలో కవిత విజయం సాధించారు..
అదే ఉత్సాహాన్ని ఎన్నికల చివరి ఘట్టం వరకు ప్రదర్శిస్తూ 11 డివిజన్లలో 9 డివిజన్లో టీబీజీకేఎస్ జెండా రెప్పలాడించారు.ఒంటిచేత్తో టీబీజీకేఎస్ ను 9 డివిజన్లలో గెలిపించి చరిత్ర సృష్టించారు.ప్రతిపక్షాలు, వామపక్షాలు ఏకమైనప్పటికి, టీబీజీకేఎస్ విజయ అవకాశాలు కష్టమైనప్పటికి తన నాయకత్వ పటిమతో ప్రతిపక్ష కూటమిని కుదేలు చేసారు.ఈ విజయాన్ని బతుకమ్మ కానుకగా టీఆర్ఎస్ పార్టీకి అందించడమే కాకుండా రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే దుష్ట శక్తులకు తెలంగాణలో చోటు లేదని మరోమారు చాటిచెప్పారు.