Home / ANDHRAPRADESH / పోలవరంపై చేతులెత్తేసిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ…చంద్రబాబులో కలవరం..!

పోలవరంపై చేతులెత్తేసిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ…చంద్రబాబులో కలవరం..!

మూలికే నక్కపై తాటిపండు పడ్డట్లు అసలే నత్త నడకన నడుస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌‌తో తలపట్టుకున్న చంద్రబాబుకు ప్రధాన నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న ట్రాన్స్‌‌ట్రాయ్ బీభత్సమైన షాక్ ఇచ్చింది.పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంస్థలు ఆర్థిక గొడవల్లో చిక్కుకున్నాయి. ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చేతులెత్తేసింది. ట్రాన్స్ ట్రాయ్ డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన త్రివేణి లాంటి సబ్ కాంట్రాక్ట్ సంస్థలు పోలవరం పనులు ఆపేశారు. డబ్బులిస్తేనే తాము పనులు మొదలుపెడతామని సదరు సబ్ కాంట్రాక్ట్ సంస్థలు భీష్మించుకున్నాయి..దీంతో నాలుగైదు రోజులుగా పోలవరం పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన జలవనరుల శాఖ ట్రాన్స్‌ ట్రాయ్ సంస్థతో చర్చించింది. అయితే ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ తాపీగా తమ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, సబ్ కాంట్రాక్టర్లకు కనీసం బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయని , ప్రభుత్వం ముందస్తుగా నిధులు కేటాయిస్తే తప్ప పనులు చేపట్టలేమని, కావాలంటే పనులు అయ్యాక తమకు ఇచ్చే మొత్తంలో రీఎంబర్స్‌మెంట్ చేసుకోండి అంటూ జలవనరుల శాఖకు తెలిపింది. తాను చేయించుకున్న పనులకు సొమ్ములు చెల్లించకపోగా ఆ డబ్బును ప్రభుత్వం చెల్లించాలని ట్రాన్స్‌ట్రాయ్ కోరడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారట. అంతే కాదు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నందున డబ్బులు ముందస్తుగా ఇవ్వకుంటే కాంట్రాక్ట్ బాధ్యతల నుంచి తొలగుతామని కూడా ట్రాన్స్‌ ట్రాయ్ తెగేసి చెప్పిందట.దీంతో ఆగ్రహించిన చంద్రబాబు పనులు చేపట్టని ప్రధాన కాంట్రాక్టు సంస్థను తక్షణమే తప్పించి ఈ-టెండరు ద్వారా మరో కొత్త సంస్థను ఖరారు చేయాలని ఆదేశించారు. అయితే పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున కీలక నిర్ణయాలన్నీ కేంద్ర పరిధిలోనే జరుగుతాయని అధికారులు వివరించారు. ఇప్పటికే చంద్రబాబును 2018లోగా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాడు. అయితే ప్రతిపక్ష వైసీపీ , ఉండవల్లి లాంటి మాజీ కాంగ్రెస్ నేతలు, జేసీ లాంటి టీడీపీ ఎంపీ కూడా పోలవరంను 2018లోగా పూర్తి చేయడం చంద్రబాబు వల్ల కాదని తేల్చి చెప్పారు. ఈ నేపథ‌్యంలో ప్రధాన నిర్మాణ సంస్థ చేతులెత్తేయడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు మరో కొత్త సంస్థ వచ్చి నిర్మాణ పనులు చేపట్టే సరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోవడం ఖాయం. ట్రాన్స్‌ ట్రాయ్‌పై ఇదివరకే అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సంస్థకు పోలవరం లాంటి భారీ ప్రాజెక్టు కట్టే సామర్థ్యం లేదని ఇంజనీర్లు , అధికారులు చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు..నిబంధనలను పక్కనపెట్టి కమీషన్ల కోసమే తమ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు ప్రధాన నిర్మాణ సంస్థగా బాధ్యతలు అప్పగించాడని విమర్శలు చెలరేగాయి..చంద్రబాబు అనాలోచిత నిర్ణయంతో పోలవరం నిర్మాణం మరింతగా జాప్యం జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ట్రాన్స్‌ట్రాయ్ తీరుతో చంద్రబాబులో కలవరం మొదలైంది. చివరకు డబ్బులు పోనాయి..నానేటి సేసేది అని సత్తి బాబులాగా బాబుగారు కూడా పోలవరం విషయంలో డైలాగ్ వేస్తాడేమో చూడాలి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat