బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సమానంగా క్రేజ్ సంపాదించిన సన్నీలియోన్ ఇటీవల ఓ చిన్నారిని దత్తత తీసుకోని తన పెద్ద మనసు చాటుకున్న సంగతి తెల్సిందే. మహారాష్ట్రలోని లాతూరు నగరానికి చెందిన ఓ చిన్నారిని సన్నీలియోన్, డెనియల్ వెబర్ దంపతులు దత్తత తీసుకొని ఆమెకు నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టారు. నిషా కౌర్ వెబర్ నల్లగా ఉండడంతో ఆమెను దత్తత తీసుకునేందుకు ఎవరు ముందుకు రాకపోగా, 11 కుటుంబాలు వచ్చి చూసి వెనక్కు తిరిగి వెళ్ళాయి.
ఇక ఈ విషయం తెలుసుకున్న సన్నీ దంపతులు నిషాని దత్తత తీసుకోని ఆ పాపని కంటికి రెప్పలా కాపాడుకోవడమే కాదు, వారు ఎక్కడికి వెళ్లిన తమ వెంట తీసుకెళుతున్నారు. తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి అరిజోనా వెళ్లిన సన్నీ, అక్కడే తన దత్తపుత్రిక నిషా రెండో బర్త్‌డే వేడుకలని ఘనంగా చేసినట్లు ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. నిషా బర్త్‌డేకి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.