బుల్లితెర పై పాపులర్ అయిన ఆట ప్రోగ్రాంతో ఫేమ్ అయిన ఓంకార్ దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే రాజుగారి గది చిత్రంతో సంచలన విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా.. రాజుగారి గదికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం రాజుగారి గది-2. కింగ్ నాగార్జున , సమంత , సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ కామెడీ నేపథ్యం లో ఈ మూవీ తెరకెక్కడం , నాగార్జున మెంటలిస్ట్ గా, సమంత ఆత్మ గా కనిపించడం తో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సినీ జనాల్లో నెలకొని ఉంది. మరి వారి ఆసక్తి ని రాజుగారు ఎలా తీర్చారనేది ఈ షార్ట్ రివ్యూ ద్వారా చూద్దాం..
ఓ ఆత్మ చుట్టూ సాగే కథనే ఈ రాజాగారి గది 2 . ఓ ఇంట్లో సమంత చనిపోయి ఆత్మగా తిరుగుతుంటుంది. అదే ఇంట్లోకి నలుగురు ఫ్రెండ్స్ అశ్విన్, సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, షకలక శంకర్ వెళ్లతారు. రోజు రాత్రి కాగానే రకరకాల శబ్దాలతో ఆ ఇల్లంతా భయంకరంగా ఉంటుంది. దీంతో ఎదుటి వ్యక్తి ని చూసి తన మనసులో ఏమనుకుంటున్నాడో యిట్టె చెప్పగల మానసిక వైద్యుడైన నాగార్జున ను పిలిపిస్తారు. ఆ ఇంటిలో ఆత్మ ఉన్నట్టు అయన గుర్తిస్తారు. దీంతో ఆ ఆత్మను బయటకు పంపే క్రమంలో అసలు సమంత ఎందుకు చనిపోయింది. ఆత్మగా ఎందుకు మారింది. ఆ ఇంట్లో ఎందుకు ఉంది.. అనే రహస్యాలను సెకండ్ హాఫ్ లో వస్తాయి..మరి చివరకు ఆత్మ ఆ ఇంటి నుండి బయటకు వెళ్లిందా.. లేదా అనేది మీరు స్క్రీన్ ఫై చూడాలి.
సమంత నటన సినిమాకే హైలైట్.. సెకండాఫ్‌లో ఆమె ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అందులో ఆమె పండించే ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాగే నాగార్జున-సమంత మధ్య వచ్చే సీన్‌లు అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ చిత్రంతలో సీరత్ కపూర్ గ్లామర్‌తో ఆకట్టుకోగా.. వెన్నెల కిశోర్, షకలక శంకర్ కామెడీ నవ్వులు పోయిస్తుంది. గెస్ట్ రోల్‌లోకాజల్ అదిరిపోయింది. గ్రాఫిక్స్ అయితే సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లాయి. ఓంకార్ డైరెక్షన్ మరోసారి ఆకట్టుకుంది.. కామెడీతో భయం పుట్టించే కథ రాసుకొని మరోసారి సక్సెస్ అయ్యాడు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోయగా.. పివిపి నిర్మాణ విలువలు బాగున్నాయి.