అక్కినేని నాగార్జున, అక్కినేని సమంతలు నంటించిన రాజుగారి గది-2 చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ శ్యామలకు వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. అసలు విషయం ఏంటంటే గురువారం రాజుగారి గది-2 చిత్రంలో భాగంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు చిత్ర యూనిట్. అయితే ఈ సందర్భంలో ఆయనను యాంకర్ శామల మీసం ఎందుకు తీసేశారని ప్రశ్నించింది. ఇలాగే చాలామంది బాగుందంటున్నారు… ఏం బాగాలేదా.. అని నాగ్ ఎదురు ప్రశ్నించారు. దానికి శ్యామల సమాధానమిస్తూ.., ఛఛ అలాంటిదేం లేదు. మీరు చాలా బాగున్నారు.. కానీ మన్మధుడికి మీసం ఉంటే కొంచెం రొమాంటిక్ గా ఉంటుంది కదా.. అంది. సమంత కూడా పెళ్ళిలో నాగార్జునను, నాగచైతన్యను గుర్తు పట్టడం చాలా కష్టమైందని మామపై చిన్న కౌంటర్ వేసింది. దీంతో పక్కనే ఉన్న సమంతతో ‘చైతన్యకి పెళ్లి అయిపోయింది.. పోటీగా వయసు తగ్గిద్దామని ప్రయత్నిస్తున్నారా.. అని ప్రశ్నించింది. వెంటనే కల్పించుకున్న నాగార్జున..పక్కనే కోడలుంది..బిహేవ్ యువర్ సెల్ప్ అంటూ చిన్న వార్నింగ్ ఇచ్చారు.