Home / ANDHRAPRADESH / లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సిన్మా ఆపేయ్…వాణీ విశ్వనాథ్‌ ఫైర్…వర్మ మైండ్‌ బ్లోయింగ్ కౌంటర్..!

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సిన్మా ఆపేయ్…వాణీ విశ్వనాథ్‌ ఫైర్…వర్మ మైండ్‌ బ్లోయింగ్ కౌంటర్..!

కాంట్రవర్సీ రాంగోపాల్ వర్మ తాను తీయబోయే సిన్మాలకు ముందే కాంట్రవర్సీ క్రియేస్ చేసి , పబ్లిసిటీ పెంచేసుకుంటాడు..తాజాగా తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సిన్మాపై కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఏ ముహూర్తంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మా తీస్తున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించాడో కానీ ఎక్కడ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటులో అసలు రహస్యాలు ప్రజలకు తెలిసిపోతాయోనని టీడీపీ బ్యాచ్‌లో కలవరం మొదలైంది. అందుకే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రాంగోపాల్ వర్మపై విరుచుకుపడుతున్నారు..అసలే వర్మకు ఎవరినైనా కెలకడం.. ఆ తర్వాత వారిని ఓ ఆట ఆడుకోవడం సరదా..ఇంకేముంది తనను విమర్శించిన మంత్రి సోమిరెడ్డిని మిష్టర్ సోమి అంటూ చెడుగుడు ఆడేసుకున్నాడు..ఆ తర్వాత ఎమ్మెల్యే అనిత కూడా ఎన్టీఆర్‌పై సిన్మా తీస్తే చూస్తూ ఊరుకోం అంటూ వర్మపై రెచ్చిపోయింది..దీంతో వర్మకూడా అనితను తనదైన స్టైల్లో ఆడేసుకున్నాడు..మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మాకు వైసీపీ నేత రాకేష్ నిర్మాత కావడం, ఎమ్మెల్యే రోజా లక్ష్మీ పార్వతి పాత్రలో చేయబోతుందంటూ వార్తలు రావడంతో కంగుతిన్న టీడీపీ వెంటనే రోజాకు కౌంటర్‌గా నగరి నుంచి బరిలోకి దింపబోతున్న మాజీ హీరోయిన్ వాణీ విశ్వనాథ్‌ను రంగంలోకి దింపింది..పాపం వాణీ విశ్వనాథ్ తెలియక పోయి పోయి వర్మ నోట్లో తల పెట్టింది. ఎన్టీఆర్‌పై .సినిమాను వెంటనే ఆపేయ్ దేవుడు లాంటి గౌరవానికి భంగం కలిగించేలా సినిమాను తీస్తే చూస్తూ ఊరుకునేది లేదని వాణీ విశ్వనాథ్ వర్మపై రెచ్చిపోయారు..అంతే కాదు వర్మ మొండిగా సిన్మా తీస్తే వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఓ పక్క ఎన్టీఆర్ బయోపిక్‌ను బాలకృష్ణ తీయబోతుంటే వర్మ ఇలా లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మా తీయడం సరైంది కాదని వాణీ విశ్వనాథ్ చిత్రమైన వాదన వినిపించారు కేవలం దురుద్దేశ్యంతో వర్మ ఈ సినిమాను తీస్తున్నాడని, వెంటనే ఎన్టీఆర్‌పై సిన్మాతీసే ఆలో్చన మానుకోవాలని వాణీ విశ్వనాథ్ వర్మపై విరుచుకుపడింది..దీంతో వర్మ కూడా వాణీ విశ్వనాథ్‌కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. వాణీ విశ్వనాథ్ నేను సిన్మా తీస్తే మా ఇంటి ముందు ధర్నా చేస్తున్నారంటున్నారు..నాకు అసలే ఇల్లు లేదు..నేను రోడ్ల వెంబడి తిరుగుతుంటూ ఉంటాను..మీరు ధర్నా చేయాలంటే నా కోసం రోడ్లన్నీ తిరగాలి..పాపం మీ సుకుమారమైన పాదాలు కందిపోతాయంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు..పోయి పోయి టీడీపీ నేతల మాటలు విని అనవసరంగా వాణీ విశ్వనాథ్ వర్మను కెలికిందని..ఇక వర్మ ఈ మాజీ హాట్ బ్యూటీని ఏ రేంజ్‌లో ఆడుకుంటాడో ఏంటో అంటూ సినీ జనాలు అంటున్నారు.. అసలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మా మొదలవకముందే రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది.ఇక ఈ సిన్మాపై ఇంకెన్ని కాంట్రవర్సీలు చెలరేగుతాయో చూడాలి. మొత్తానికి కాంట్రవర్సీ కింగ్ వర్మ మాత్రం పండుగ చేసుకుంటున్నాడు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat