గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హమీను నేరవేర్చకపోవడం ..గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్న పలు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ..రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పదేండ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని గాలికి వదిలేసిన తీరుకు నిరసనగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రను నిర్వహించతలపెట్టారు .
ఈ క్రమంలో పాదయాత్ర అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం .అయితే పాదయాత్రకు అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారు అని నిన్న మొన్నటివరకు ఆ పార్టీకి చెందిన నియోజక వర్గాల ఇంచార్జ్ ,సమన్వయ కర్తలు తెగ మదనపడ్డారు .అయితే ఈ వ్యవహారాన్ని అంతట చూసుకునేందుకు ముందుకు వచ్చారు వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు .అయితే జగన్ నిర్వహించతలపెట్టిన పాదయాత్రకు అయ్యే ఖర్చు అంత తానూ భరిస్తాను అని ..నియోజక వర్గాలలోకి వచ్చిన సమయంలో దానికి తగ్గట్లు మద్దతు ఇస్తే చాలు అని ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యే అన్నట్లు సమాచారం .
జగన్ పాదయాత్ర నిర్వహించే మార్గాల్లో మెత్తటి మట్టిని వేయడమే కాకుండా ..ఆది దుమ్ము లేవకుండా వాటర్ ట్యాంక్ ల ద్వారా నీళ్ళను సరఫరా చేసి చల్లడం ..జగన్ కు వాహనాలను సమకూర్చడం లాంటివి తను చేస్తాను అని వైసీపీ శ్రేణులకు హామీ ఇచ్చారు అని సమాచారం .అయితే ఆ ఎమ్మెల్యే తనయుడు కూడా ఈ విషయంలో ముందుకు వచ్చారు .ఆ ఎమ్మెల్యే తనయుడు ఎంపీ కావడం గమనార్హం ..దీంతో ఆర్ధికంగా బలం లేని నియోజక వర్గాల ఇంచార్జులు ఉపిరి పీల్చుకున్నారు .జగన్ పాదయాత్రకు అయ్యే ఖర్చులను పెట్టడానికి ముందుకు వచ్చిన సదరు ఎమ్మెల్యే ,ఎమ్మెల్యే తనయుడు అయిన యువ ఎంపీ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ అభినందిస్తూ వైసీపీ శ్రేణులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు .