అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఏ హోర్డింగ్ చూసిన..ఏ టీవీ ఛానల్ మార్చిన ప్రతి పది నిమిషాలకు తప్పనిసరిగా వచ్చే యాడ్ ప్రముఖ బంగారం వ్యాపార సంస్థ అయిన లలితా జ్యువెలరీ గురించే .ఈ యాడ్ లో ఆ సంస్థకు ఛైర్మన్ అయిన కిరణ్ కుమార్ కనిపిస్తూ . “బంగారం షాపులకు వచ్చేవారు బాగా రిచ్ అని అనుకుంటారు .అందుకే మా దగ్గర మీకు నచ్చిన నగలను ఎంచుకోండి..వాటిని మీ మొబైల్ ఫోన్ లో ఫోటో తీసుకోండి..అంతే కాకుండా ఆ నగల ధరను కూడా నిర్ణయించే స్లిప్ తీసుకోండి. ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ నాలుగైదు బంగారం షాపుల్లో ధరను కనుక్కోండి.
ఎక్కడ ధర తక్కువగా ఉంటుందో ఆ షాపులో తీసుకోండి .ఎందుకంటే డబ్బులు ఊరికినే రావు”అని అందర్నీ కన్వేన్స్ అయ్యేలా ప్రకటనలో చెప్తుంటారు .అయితే కిరణ్ ఇచ్చే ఇలాంటి ప్రకటనలకు అయ్యే ఖర్చు, షోరూమ్ ల నిర్వహణకి అయ్యే ఖర్చు బంగారం వినియోగదారులపై పడే అవకాశం ఉంది .అది అందరికి తెల్సిన విషయం . అదే మీకు తెలిసిన స్వర్ణకారుడి దగ్గర నగలు చేయించుకుంటే ..కిరణ్ చెప్పే లలితా జ్యూయెలరీ లో కొనే నగల ధరకంటే అతి తక్కువ ధరకి వస్తాయని ఏపీలో ఒంగోలుకు చెందిన స్వర్ణకారుడు నాగండ్ల జగన్మోహన్ అంటున్నారు .
అంతే కాకుండా ఇలా బంగారం షాపులలో కొనే నగల కన్నా స్వర్ణ కారుల దగ్గర సొంతంగా చేయించుకుంటే కొలతలు సరిగా ఉంటాయి .అంతే కాకుండా స్వయంగా మీకు నచ్చిన డిజైన్లలో చిన్న చిన్న మార్పులు చేసి కూడా నగలు చేయించుకోవచ్చని ఆయన అంటున్నారు. ఇక బంగారం నాణ్యత విషయానికి వస్తే నాణ్యత విషయంలో కూడా ఇప్పుడు స్వర్ణకారులు హాల్ మార్క్ వేయించి ఇస్తున్నారని కావున బంగారం నాణ్యత కూడా గ్యారంటీ అని చెబుతున్నారు. మొత్తానికి లలితా జ్యూయెలరీ అయినా ఏ జ్యూయెలరీ అయినా స్వర్ణకారుడి కన్నా తక్కువ ధరకి ఇవ్వలేరని, తమ దగ్గర పన్నులు కూడా తక్కువ అని జగన్మోహన్ అంటున్నారు. సో స్వర్ణ కారుల దగ్గర చేయించుకోవడం బెటర్ అన్నమాట ..