తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం ఇటు అధికారక కార్యక్రమాల్లో అటు ప్రజాక్షేత్రంలో బిజీ బిజీగా ఉండే నాయకుడు .ఎన్నో యేండ్ల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి తన వంతు పాత్రగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ,కొత్త ప్రాజెక్టులను శరవేగంగా పూర్తీ అయ్యే విధంగా ఇరవై నాలుగు గంటలు ప్రాజెక్టుల వెంట ..సంబంధిత అధికారుల వెంట పడుతున్నాడు .
ఈ క్రమంలో దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నేతలకు ఆదర్శంగా ఉండే ఒక పని చేశారు .అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా కంపెనీ కోసం మంత్రి హరీష్ తన పట్టా భూములను ఇచ్చారు .హైదరాబాద్ మహానగర శివార్లలో ఫార్మా సిటీకోసం టీఎస్ఐఐసీ వేల ఎకరాలను సేకరిస్తుంది .ఇందులో భాగంగా స్థానిక రైతుల అంగీకారంతో వారికి పరిహారం కూడా చెల్లిస్తుంది .
పర్యావరణానికి సంబంధించి యాచారం మేడిపల్లిలో ప్రజాభిప్రాయం సేకరించారు .ఇప్పటికే చాలా మంది రైతులు తమ భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారు .ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు కూడా తనకు చెందిన 17 .03 ఎకరాల పట్టా భూమిని ఎకరాకు పన్నెండు లక్షల రూపాయల చొప్పున రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలకు టీఎస్ఐఐసీకి అప్పజెప్పారు .అయితే తమ భూములను కోట్లకు కోట్లకు అమ్ముకునే రాజకీయ నేతలున్న ప్రస్తుత రోజుల్లో మంత్రి హరీష్ రావు ఇలా చేయడం చూసి స్థానిక రైతులతో పాటుగా ప్రజలు హరీష్ రావు మీద ప్రశంసల వర్షం కురిపిసున్నారు .