అగ్రిగోల్డ్..తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద కుంభకోణం..20 ఏళ్లుగా డైలీ ఫైనాన్స్ పేరుతో రోజుకు 10 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేసి చిట్టీల వ్యాపారం చేసి నమ్మకం తెలుగు ప్రజల్లో నమ్మకం కలిగించిన ఈ అగ్రిగోల్డ్ సంస్థ టర్పోవర్ వేల కోట్లకు చేరుకుంది..ఆ తర్వాత పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, రంగంలో ప్రవేశించిన అగ్రిగోల్డ్ సామ్రాజ్యం ఆ తర్వాత రియల్ ఎస్టేట్, రిసార్ట్స్ లలో కూడా పాగా వేసింది..అలా తెలుగు రాష్ట్రాల్లో మహా వృక్షంలా శాఖోపశాఖలుగా విస్తరించిన అగ్రిగోల్డ్ సంస్థ అకస్మాత్తుగా బోర్డ్ తిప్పేసింది..దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు కష్టపడి పైసా పైసా కూడబెట్టుకున్న 20 లక్షల కుటుంబాల బతుకులు రోడ్డున పడ్డాయి.. అగ్రిగోల్డ్ సంస్థ ఛైర్మన్‌ను , అతని సోదరుల్లో ఒకడిని పోలీసులు అరెస్ట్ చేశారు..గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సిఐడీ అధికారులు విచారణ ఆరంభించారు.. అయితే ఇంత వరకూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగలేదు..తమ డబ్బులు వస్తాయో రావో అన్న బెంగతో ఇప్పటికే ఏపీలో 108 మంది తనువు చాలించారు.వారికి చంద్రబాబు ప్రభుత్వం 3 లక్షల నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయింది..ఇక అగ్రిగోల్గ్ ఆస్తులు వేలం వేయకుండా చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతుంది..మరోవైపు అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళనను కూడా పట్టించుకోవడం లేదు..నిందితులను వెనకేసుకునివస్తూ బాధితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది..
అయితే ప్రతిపక్ష వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీలో అగ్రి గోల్డ్ చర్చ సందర్భంగా బాధితులకు న్యాయం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని తూర్సారబట్టారు.. కేవలం 1182 కోట్లతో 14 లక్షల మంది బాధితులకు తక్షణ ఉపశమనం కలుగుతుందని తెలిసినా చంద్రబాబు ప్రభుత్వం వారికి పరిహారం ఇప్పించకుండా
మీనమేషాలు లెక్కపెడుతుందని విమర్శించారు..అంతే కాదు కోర్టులు అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి బాధితులకు పరిహారం చెల్లించాల్సిందిగా రెండు, మూడు సార్లు టీడీపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా చీమ కుట్టినట్లు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ హాయ్‌ల్యాండ్ భూముల కుంభకోణంలో సాక్షాత్తు చంద్రబాబు తనయుడు లోకేష్ కు పాత్ర ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. ఆ తర్వాత స్వయంగా విజయవాడలో నిరాహార దీక్షలు చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను కలిసి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని, మరణించిన బాధితుల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తానని ప్రకటించి వారికి భరోసా ఇచ్చారు..
లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల తరపున ప్రతిపక్ష వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న పోరాటానికి చంద్రబాబు ప్రభుత్వ దిగి వచ్చింది.ఆగ్రి గోల్డ్ బాధితుల లిస్టు ఆన్‌లైన్‌లో పెట్టాలి అని జగన్ చేసిన డిమాండుకు చంద్రబాబు సర్కార్ అగ్రిగోల్డ్ బాధితుల లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో పెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. దీంతో బాధితులకు పెద్ద ఎత్తున ఊరట లభించింది. అసలు లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల వారికి ప్రభుత్వం తరపున అందించే పరిహారం పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది. తమ కోసం పోరాడిన జగన్ వల్లనే బాబు దిగివచ్చాడని. .వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు పూర్తి న్యాయం చేస్తాడని నమ్మకం ఉందని అగ్రిగోల్డ్ బాధితులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.