తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రగతి సభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలపై సెటైర్ల వర్షం కురిపించారు .మొత్తం రెండు గంటల్లో ఆరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు .అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా చైతన్యంలో ముందు నిలిచిన జిల్లా ..ఉద్యమాల పోరాటాల ఖిల్లా .కానీ ఏమి జరిగింది ..?.
ఏమి జరగలేదు .ఇక్కడ ఉన్న మనుషులు గెలవలేదా ..?.మంత్రులుగా చేయలేదా ..?.ఎత్తు ఎమన్నా తక్కువ ఉన్నారా ..?.దొడ్డు కూడా ఎమన్నా తక్కువ ఉన్నారా ..?.అంటే అది ఏమి లేదు .ప్రజలకు ఒరిగింది కూడా ఏమి లేదు .అరవై యేండ్లలో నలబై ఐదు ఏండ్లు హస్తం గుర్తు పార్టీ వాళ్ళే రాష్ట్రాన్ని ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాను ఏలారు .కానీ ఏమైంది పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్న కానీ త్రాగడానికి గుక్కెడు నీళ్ళను కూడా అందించలేకపోయారు .
దీంతో ఉమ్మడి జిల్లా త్రాగడానికి పక్కనే ప్రాజెక్టు ఉన్న కానీ ప్లోరైడ్ జిల్లాగా ముద్ర పడింది .సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు నల్గొండ జిల్లా ప్రజలను దగచేశారు .పంతొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇక్కడ కట్టారు .మోసం జరిగింది .అక్కడే కట్టి ఉంటె నల్గొండ మొత్తానికి నీళ్ళు వచ్చేవి రాలేదు అని అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన మోసాన్ని కుట్రలను బయటపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్ ..