ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలక విపక్షాలు పెట్టిన అక్రమంగా పెట్టిన కేసులో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు.
అయితే వచ్చే నెల నవంబర్ 2వతేదీ నుంచి తాను తాను పాదయాత్ర చేపడుతున్న దృష్ట్యా వ్యక్తిగత హాజరు నుంచి 6 నెలలు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ పై ప్రస్తుతం విచారణ జరగుతోంది. ఇదిలా ఉండగా జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వవద్దంటూ సీబీఐ న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణలు జరుగుతున్నాయి.