దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మరో రెండు ఉదాహరణాలు ఇదిగో . బిహార్‌లో రెండు అత్యంతా దారుణమైన ఘటనలు వెలుగు చూశాయి. ఒకదాంట్లో లైంగిక దాడికి గురైన బాధితురాలు అవమానభారంతో ఆత్మహత్య చేసుకోగా.. మరో కేసులో అత్యాచారయత్నం విఫలం కావటంతో దుండగులు ఓ మహిళను అతిదారుణంగా హింసించి హత్య చేశారు. రాజధాని పట్నాకు కాస్త దూరంలో ఉన్న నౌబట్‌పూర్ గ్రామంలో ఈ ‘నిర్భయ’ తరహా ఉదంతం వెలుగు చూసింది.
ధీరజ్ పాశ్వాన్ అనే 22 ఏళ్ల యువకుడు.. అదే గ్రామానికి చెందిన మహిళ(35)తో కొంత కాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆమెపై తన స్నేహితుడి సాయంతో ధీరజ్ దారుణానికి యత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించగా.. ఆపై అకృత్యానికి పాల్పడ్డాడు. ముందు కర్రతో కొట్టి.. ఆపై గాయపడిన ఆమె జననేంద్రియాల్లోకి ఇనుపరాడ్లను చొప్పించి హింసించాడు. ఆమె పరిస్థితి విషమించటంతో పట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు కాసేపటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మహిళా సంఘాలు ఉద్యమానికి సిద్ధం కాగా, కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందం(సిట్) ను ఏర్పాటు చేసినట్లు ఏడీజీ ఎస్ కే సింగల్ తెలిపారు.
ఇప్పటికే ప్రధాన నిందితుడు ధీరజ్‌ను అదుపులోకి తీసుకున్నామని.. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. కాగా, నలుగురు పిల్లల తల్లి అయిన ఆమె.. ఆ యువకుడితో గతంలో సన్నిహితంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.