తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. బాలల హక్కులను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిషన్‌ను రద్దు చేస్తూ ఈ రోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, బాలల హక్కులను పరిరక్షించే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ సభ్యుల నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్చుతారావు నెల రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విధితమే. నెల రోజుల విచారణ తరువాత బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ఆదేశించింది.
