దేశం నలుమూలాల మహిళలపై అత్యంత దారుణంగా రేప్ లు జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళపై హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి అత్యాచారం చేసిన ఘటన న్యూఢిల్లీలో వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ న్యూఢిల్లీలోని ఓ కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిచేస్తోంది. ఎంపీ లేనపుడు ఇంటికి వచ్చిన హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి 2015 సెప్టెంబరు 15 నుంచి 23వతేదీ మధ్యలో మూడుసార్లు అత్యాచారం చేశాడని పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తమ కుటుంబం నుంచి డబ్బు గుంజేందుకే పనిమనిషి తప్పుడు ఆరోపణలు చేస్తుందని సుభాష్ చౌదరి ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
