ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలం చిలుమూరు రీచ్ నుంచి అధికార పార్టీకి చెందిన సదరు ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా భారీగా ఇసుకను తరలిస్తున్నారు.
అయితే విషయం తెలుసుకున్న స్థానికులు ఇసుక రీచ్ వద్దకు చేరుకుని ఎమ్మెల్యే అనుచరులను అడ్డుకున్నారు. అలాగే చిలుమూరు బ్రిడ్జి దగ్గర ఇసుక లారీలను నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అనుచరులకు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.