కామంధులు మారడం లేదు చాల అత్యంత దారుణంగా మహిళలపై రేప్ జరుపుతున్నారు. మరి దారుణం ఏమీటంటే పసి మొగ్గలపై కూడ వారి కామం తీర్చుకుంటున్నారు. తాజాగా బాలికను అపహరించి, లైంగిక దాడికి పాల్పడి, గొంతు నులిమి హత్యచేసిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం మన్నాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు, స్వప్న దంపతుల కుమార్తె సాయి ప్రియాంక(6)పై సొంత బాబాయి శివకుమార్(19) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న సాయిప్రియాంక బుధవారం సాయంత్రం ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చిరాగ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బాలికను శివకుమార్‌తో కలిసి చూసినట్లు కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శివకుమార్‌ను అదుపులోకి విచారించగా బాలికపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడి గొంతు నులిమి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహాన్ని పడేసినట్లు చెప్పాడు. పోలీసులు గ్రామస్థుల సాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని జహీరాబాద్ డీఎస్పీ నల్లమల రవి, సీఐ సదా నాగరాజు పరిశీలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.