ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు లేదా ముగ్గురు ప్లిల్లల్ని కనాలంటూ సలహా ఇస్తున్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో యువత కొరత ఏర్పడితే అభివృద్ది క్షీణిస్తుందని, పనులు చేసే వారు లేకపోతే రోబోలపై ఆధారపడాల్సి వస్తుందని, అందుకే యువత ఎక్కువ ఉండాలి అంటే తాను చేసిన తప్పు మరెవ్వరు చేయవద్దని చంద్రబాబు అన్నారు. భారత జనాబా పెరుగుతుందని అప్పటి ప్రభుత్వాలు ఎక్కువగా కుటుంబ నియంత్రణ ప్రచారం చేసిన వారిలో చంద్రబాబు ఒకడు. ప్రస్తుతం దీనిపై తన వ్యక్తిగతం గురించి సీఎం అన్న మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
దేశ..రాష్ర్ట ప్రభుత్వాల ప్రచారానికి మద్దతుగా నేను ఒక్క కొడుకుతో కుటుంబ నియంత్రణ పాటించాను. కాని ఇప్పుడు అలా చేయడం తప్పు. మన వెనుకటి తరం ఇలాగే ఆలోచిస్తే మనం లేకపోయేవాళ్లం. అందుకే ఒక్కరు కాకుండా ఇద్దరు లేదా ముగ్గురిని కనాలంటూ చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్‌లో చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. మీడియా ముందు చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన మారిన మనస్థత్వాన్ని వ్యక్తీకరిస్తున్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే బాబుపై విచిత్రమైన కామెంట్స్ తో హల్ చల్ చేస్తున్నారు. ఉన్న వాళ్లకే జాబ్ ఇవ్వని చంద్రబాబు… ఇద్దర్ని..ముగ్గుర్ని కనండి అనడం…ఏంటో మాకు తెలుసులే కేవలం మాటలు చెప్పడానికే నువ్వు అంటున్నారు.