అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసేందుకు ఓ భార్య వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. నగరంలోని హైదర్‌గూడకు చెందిన జ్ఞానేశ్వర్, సునీత భార్యాభర్తలు. జ్ఞానేశ్వర్ టిఫిన్ సెంటర్లో పనిచేస్తుండగా సునీత ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సునీతకు సహోద్యోగి శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ అక్రమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు పథకం పన్నింది. ఈ నెల 7న మద్యం తాగి ఇంటికి వచ్చిన జ్ఞానేశ్వర్‌కు నిద్రమాత్రలు ఇచ్చింది. అతడు నిద్రలోకి జారుకున్నాక వెంకటేశ్ అనే ఆటోడ్రైవర్ సాయంతో కీసర అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేయాలని ప్రణాళిక రూపొందించింది. అయితే మార్గమధ్యలో మెలకువ వచ్చిన జ్ఞానేశ్వర్ వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సునీత, అమె ప్రియుడు శ్రీనివాస్, ఆటోడ్రైవర్ వెంకటేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Tags illigal affier lover murder telangana