ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సినీ సంచలనం రామ్ గోపాల్ వర్మ ట్రాప్‌లో పడి గిలగిలా కొట్టుకుంటున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వర్మ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్‌కి కావల్సినంత హైప్ క్రియేట్ చేసుకున్న వర్మ.. టీడీపీ మంత్రి సోమిరెడ్డని మాత్రం ఆడేసుకుంటున్నాడు. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డికి చుక్కలు చూపిస్తున్న వర్మ మరోసారి సోషల్ మీడియా ద్వారా సెటైర్లు వేశాడు. మినిస్టర్ సోమిరెడ్డి కామెంట్స్ కు నా రిప్లైస్ అంటూ ప్రారంభించిన వర్మ.. సోమిరెడ్డి చేసిన కామెంట్లను… దానికి అతని సమాధాలను తెలిపాడు.
వర్మతో బహిరంగచర్చకు నేనే కాదు నా పాలేరు కూడా వెళ్లడు అంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు బదులుగా.. మీరు, మీ పాలేరు కూడా చర్చకు రాలేనప్పుడు అసలు నా మాటల మీద స్పందించవలసిన అవసరమేమొచ్చింది సార్.. మీరు రావట్లేదంటే మీ కన్నా ఎన్టీఆర్ గారి గురించి నాకే ఎక్కువ తెలుసని మీరు ఒప్పుకున్నట్టేగా.. థాంక్స్ సార్ అంటూ సమాధానమిచ్చాడు వర్మ.ఇక తెలివితేటలు ఏమైనా ఉంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సక్సెస్ పై చూపించు అన్న సోమిరెడ్డి కామెంట్స్‌కు బదులుగా.. వావ్. ఏం జీనియస్ సార్ మీరు.. మీరు చెప్పేవరకు నాకు ఈ విషయమే తట్టలేదు. సోమి టీచర్ గారు.., గొప్ప పాఠం చెప్పారు. ఫీజు ఏ అడ్రస్‌కు పంపాలో చెప్పండి అంటూ సెటైర్ వేశాడు.