ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొంటున్న చేదు అనుభవాలను ఓపెన్ గానే చెబుతున్నారు. నిర్మాతలు, హీరోలు తమను లైంగికంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని వీరు వివరిస్తున్నారు. ఒక్కొక్కరిగా తాము ఎదుర్కొన్న విషాదకర అనుభవాలను వివరిస్తున్నారు. ఇదే సమయంలో హాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాత సెక్స్ స్కాండల్స్ చర్చనీయాంశంగా మారాయి. హార్వీ విన్స్టన్ అనే నిర్మాత గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన సంచలన వార్తా కథనం అంతర్జాతీయంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ 65 యేళ్ల వయసున్న సినీ నిర్మాత గత ముప్పై సంవత్సరాలుగా అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని న్యూయార్క్ టైమ్స్ ఆరోపించింది.
ఇందుకు సంబంధించి అనేక ఉదంతాలను పేర్కొంది. అనేక మంది నటీమణులకు ఇతడు డబ్బులు ఇచ్చి వ్యవహారాలను సెటిల్ చేసుకున్నట్టుగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇదే సమయంలో కొంతమంది హీరోయిన్లు కూడా తాము విన్ స్టన్ చేతిలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్టుగా ప్రకటించడం మరింత సంచలనంగా మారింది. ఇలా ఈ నిర్మాతపై ఆరోపణలు చేసిన వారిలో విఖ్యాత నటీమణి ఏంజెలీనా జోలీ కూడా ఉండటం గమనార్హం. అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోయిన్లను ట్రాప్ చేయడం, వాళ్లకు అడ్వాన్స్ ఇచ్చి ఆకట్టుకోవడం ఆపై.. వారిని లైంగికంగా వాడుకోవడం విన్స్టన్ అలవాటుగా తెలుస్తోంది. ఏంజెలీనా జోలీ కూడా అలాంటి బాధితురాలేనట. ఇక సినీ నిర్మాతపై వస్తున్న ఆరోపణలను అతడి భార్య కూడా ధ్రువీకరిస్తూ ఉండటం గమనార్హం. అంత నీఛ చరిత్ర ఉన్న అతడిని వదిలిపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ నిర్మాత భార్య ప్రకటించింది. ఈ సినీ నిర్మాతపై వస్తున్న లైంగిక ఆరోపణలు నిరూపణ అయితే.. కనీసం పాతిక సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.