Home / TELANGANA / సంకినేని అసంబద్ధ ఆరోపణలు..ఎల్లో మీడియా కాకి గోల…!

సంకినేని అసంబద్ధ ఆరోపణలు..ఎల్లో మీడియా కాకి గోల…!

తెలంగాణ ప్రతిపక్షాల తీరు చూస్తుంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది. ఎప్పుడూ బేస్‌లెస్ ఆరోపణలు తప్ప..ఒక్కటి కూడా నిర్మాణాత్మక విమర‌్శలు చేసిన పాపానా పోలేదు..కేవలం టీఆర్ఎస్ సర్కార్‌పై పదే పదే అబద్దాలు వల్లిస్తే ప్రజలు నమ్ముతారనే భ్రమల్లో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుపోతున్నాయి.. టీఆర్ఎస్ సర్కార్ చేసే పనుల్లో ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా క్షేత్ర స్థాయిలో అనుకోకుండా అవకతవకలు జరిగి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయి సరి చేసుకుంటుంది. దీంతో ప్రతిపక్షాలకు అవకాశంలేకుండా పోతుంది..అందుకే ఆయా పార్టీలన్నీ ప్రతి చిన్న విషయానికి ఇష్టానుసారంగా అసంబద్ధ ఆరోపణలుచేయడం, వారికి ఎల్లోమీడియా, వెబ్‌సైట్లు వంతపాడడం కామన్ అయిపోయింది..తాజాగా సూర్యాపేట కలెక్టరేట్‌ విషయంలో రూ. 200 కోట్ల స్కామ్ జరిగిందని బిజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపణలు చేశాడు. టీఆర్ఎస్‌ పార్టీని విమర్శిస్తే ఛోటా, మోటా లీడర్లకు కూడా భారీగా కవరేజ్ ఇచ్చే ఎల్లో మీడియా, వెబ్‌సైట్లు సంకేనిని విమర్శలతో రెచ్చిపోయాయి..ఆయన ఆరోపణలను భారీగా ప్రొజెక్ట్ చేశాయి. అయితే సూర్యాపేటలో మాత్రం అసలు సీన్ వేరే ఉంది. అసలు కలెక్టరేట్ విషయం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు..అసలు సంకినేని గారు ఏమంటున్నారంటే ప్రభుత్వ భూములను వదిలేసి , ప్రైవేట్ భూములను కొనుగోలు చేసి కలెక్టరేట్ నిర్మిస్తున్నారని..దీని వల్ల చుట్టూ పక్కల భూముల రేట్లు పెరిగేలా మంత్రి జగదీష్ రెడ్డి చేశారని..ఇది రూ. 200 కోట్ల స్కామ్ అని సంకినేని ఆరోపిస్తున్నారు . అయితే ప్రభుత్వ భవనాల కోసం ప్రైవేట్ భూములు కొనుగోలు చేయడంలో పెద్ద తప్పేమి లేదు..ప్రజలందరికీ అనువుగా ఉండేందుకు ప్రైవేట్‌‌ భూములను కొంటే తప్పులేదు..ఒక వేళ రూ. 50 కోట్ల విలువైన భూమిని రూ. 200 కోట్లకు కొనుగోలు చేసి రూ. 150 కోట్లు వాటాలు పంచుకుంటే అవినీతికి కిందకు వస్తుంది..కానీ సూర్యాపేట కలెక్టరేట్ భూముల కొనుగోలు అంతా పారదర్శకంగానే జరిగింది. ఈ భూముల కొనుగోలు వల్ల చుట్టు పక్కల భూముల రేట్లు పెరిగాయని సంకినేని అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు..ఎక్కడైనా ప్రభుత్వ సంస్థలు, కార్యలయాలు ఏర్పడితే చుట్టూ కమర్షియల్‌గా బిజినెస్ సెంటర్స్ ఏర్పడుతాయి..దీంతో సహజంగానే అక్కడి భూముల రేట్లు పెరుగుతాయి..చంద్రబాబు తన వాళ్లందరి కోసం మాదాపూర్ గుట్టల్లో ఒక్క హైటెక్ సిటీ కట్టించి భూముల రేట్లు పెరిగేలా చేయలేదా..ఈ విషయం మాజీ టీడీపీ నేత అయిన సంకినేనికి ఆ మాత్రం తెలియదా..మరి సంకినేని గారు ఏ ఉద్దేశంతో విమర్శలు చేశారో కానీ..ఎల్లో మీడియా, వెబ్‌సైట్లు రెచ్చిపోయి సూర్యాపేటలో రూ. 200 కోట్ల అవినీతి బాగోతం అని కాకిగోల పెట్టింది…దీంతో సూర్యాపేట ప్రజలు విస్తుపోయారు. అసలు ప్రజల కోసం కలెక్టరేట్ కడుతుంటే ప్రతిపక్షాల సొల్లువాగుడు ఏందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat