మన హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత భర్త ఇంటి పేరే భార్య ఇంటి పేరు అవుతుంది. దీనికి తగ్గట్టే తన పేరును సమంత రుత్ ప్రభు నుంచి సమంత అక్కినేనిగా మార్చుకుంది హీరోయిన్ సమంత పేరును ట్విట్టర్ లో సమంత అక్కినేనిగా పేరు మార్చుకుంది శామ్. సమంత తన ట్విట్టర్ ఖాతాలో ఇప్పటి వరకు సమంత రుత్ ప్రభుగా ఆమె పేరుండేది. తాజాగా తన పేరును సమంత అక్కినేని గా మార్చడం విశేషం.
సమంత ఈ నెల మొదటి వారంలో అక్కినేని వారి కోడలు అయిన విషయం తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయంలో అక్టోబర్ 6, 7 తేదీలలో నాగచైతన్య, సమంతల జంట ఒక్కటైంది. ఈ నేపథ్యంలో సమంత ఇవాళ ట్విట్టర్లో తన ఇంటిపేరును ఎడిట్ చేసి.. సమంత అక్కినేనిగా మార్చుకుంది. ఐదేళ్ల ప్రేమ బంధాన్ని.. మూడుముళ్ల బంధంగా మార్చుకున్న ఈ జంటకు అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, త్వరలో వీరిద్దరి మ్యారేజ్ రిసెప్షన్ హైదరాబాద్లో గ్రాండ్గా జరగనుంది.