టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య సరసన రెండు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే బాలీవుడ్‌లో బోల్డ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పలు బాలీవుడ్ చిత్రాల్లో అర్థనగ్న దృశ్యాల్లో నటించిన రాధికా ఆప్టే తరచూ వివాదస్పద వ్యాఖ్యల ద్వారా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంటుంది. అలాగే, దక్షిణాది సినీ పరిశ్రమ పై వీలున్నప్పుడల్లా అవాకులు.. చవాకులు పేలుతుంటుంది. ఆ మధ్య ఓ దక్షిణాది హీరో తనను బెడ్ రూంలోకి రమ్మన్నాడని వ్యాఖ్యానించిన రాధికా ఆప్టే మరోసారి అలాంటి తరహా వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఆమె మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్లను పడక గదికి రమ్మని ఒత్తిడి చేసే సంప్రదాయం ఉందని ఆమె కామెంట్ చేసింది. తనకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని.. స్టోరీ డిస్కషన్స్ అంటూ తన ఆఫీస్‌కు పిలిచిన ఓ నిర్మాత తదనంతరం తనను రాత్రి పూట బెడ్‌రూంకు రావాలంటూ ఒత్తిడి తెచ్చాడని చెప్పింది. అయితే, తాను అంగీకరించలేదని తెలిపింది. ఇలాంటివి రిజెక్ట్ చేయడం వల్లే తనకు దక్షిణాదిలో ఎక్కువ అవకాశాలు రావడం లేదని ఆవేదన వెలిబుచ్చింది.