సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్ర లోనైనా యిట్టె లీనమైపోయే గ్లామర్ బ్యూటీ నయనతార.. ఇప్పుడు కలెక్టర్‌గా కనిపించబోతుంది. నయనతార మెయిన్ రోల్ లో తమిళంలో తెరకెక్కుతున్న ఆరమ్ చిత్రాన్ని తెలుగులో కర్తవ్యం పేరుతో విడుదల చేయబోతున్నారు. గోపి నైనర్ దర్శకత్వంలో ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార జిల్లా కలెక్టర్‌గా కనిపించబోతుంది.
ఇక నిర్మాత మాట్లాడుతూ రాజకీయం నేపథ్యంలో, నాటకీయ పరిణామాలతో ఆసక్తికరంగా సాగే చిత్రమిది. మా టైడెంట్ ఆర్ట్స్ పతాకంపై శివలింగ, విక్రమ్ వేదా తదితర విజయవంతమైన చిత్రాల్ని నిర్మించాం. 450కి పైగా చిత్రాల్ని పంపిణీ చేశాం. విభిన్నమైన కథల్ని ఎంపిక చేసుకొంటూ వరుస విజయాల్ని సొంతం చేసుకొంటున్నారు నయనతార. అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలిపారు.