టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు(కౌబాయ్ చిత్రం)అప్పట్లో ఓ సంచలనం. ఇక అల్లూరి సీతా రామరాజు గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు ప్రజలకి కృష్ణుడు అంటే.. ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో.. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారే గుర్తుకు వస్తాడు. తెలుగు సినిమా చరిత్రలో అనేక సంచలన చిత్రాలను తన పేరిట లిఖించుకున్న కృష్ణకి చత్రపతి శివాజీ క్యారెక్టర్ అంటే అత్యంత ఇష్టంగా ఉండేదట.
అయితే ఆయన ఆ సినిమా చేయలేకపోయారు. కానీ ఆ లోటుని కీరవాణి తండ్రి గారైన శివ సక్తి దత్తా తీసిన చంద్రహాస్ సినిమాలోనూ, అపట్లో ఎస్వీ కృస్ణా రెడ్ది తీసిన అమ్మదొంగలో ఒక పాటలోనూ కాసేపు ఆ గెటప్‌లో కనిపించి తన కోరిక అలా తీర్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన కొడుకు ప్రిన్స్ మహేష్ బాబు.. ఆ శివాజీ గెటప్ లో కనిపిస్తే.. ఎలా ఉంటుంది.., దానికి రాజమౌళి దర్శకుడైతే.. ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతుంది.
అయితే ఇదే విషయంపై ప్రముఖ సినీ రచయిత పరచూరి గోపాల కృష్ణ తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లూడుతూ సూపర్ స్టార్ కృష్ణ శివాజి చరిత్రతో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు.. వారు చేయకున్నా శివాజి కథ మహేష్ తో చేస్తే అదిరిపోతుందని.. అంతే కాకుండా.. మహేష్ హీరోగా శివాజిగా చూపించే సత్తా కేవలం రాజమౌళికి మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్.టి.ఆర్, కృష్ణ చేయలేని ఆ ప్రాజెక్ట్ మహేష్ చేస్తే బాగుంటుందని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
అంతే కాకుండా మహేష్‌ని చత్రపతి శివాజీలో శివాజీ గెటప్‌కు కృష్ణగారు ఎంత బాగ సరిపోతారో.. మహేష్ కూడా అంతే బాగుంటాడు. ఈ పాత్రలో నటిస్తే జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి పేరు వచ్చే అవకాశాలున్నాయి. ఆ పాత్రలో మహేశ్ బాబు నటించాలని నేను కోరుతున్నా..మీరు కూడా కోరండి అని ప్రేక్షకులను ఉద్దేశించి గోపాలకృష్ణ అన్నారు. ఇక ప్రస్తుతం కొరటాల శివతో భరత్ అను నేను సినిమా చేస్తున్న మహేష్.. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాతైనా రాజమౌళి, పరుచూరి పలుకులని పట్టించుకుంటాడేమో చూడాలి మరి. ఒక వేళ అలాంతి ప్రయత్నం గనక జరిగితే తెలుగు సినీ చరిత్రలో మరో సంచలనమే అని సర్వత్రా చర్చిచుకుంటున్నారు.