తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈ సారి ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పి ప్రస్తుత రోజులో సాధారణంగా ఒక లీడర్ ఉండే రీతి కంటే భిన్నంగా వ్యవహరించి తనకు తనే సాటి అని నిరుపించుకున్నారు .సాధారణంగా నేటి రోజుల్లో నాయకుడు అంటే చుట్టూ మందీ మర్భాలం ఉంటారు .అడుగు వేస్తె చాలు అహో ఓహో అని అంటూ కీర్తనలు చేస్తారు .చేసేది గోరంత ..చెప్పేది మాత్రం కొండంత ..
అయితే వాటికి భిన్నంగా ఒక లీడర్ ఎలా ఉంటాడు అంటే అచ్చం మంత్రి కేటీఆర్ లా ఉంటారు అని ప్రజానీకం అనుకుంటున్నారు .అసలు విషయానికి వస్తే రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్‌లో జరిగిన ఫార్మా సమావేశానికి హాజరైన ఒక మహిళ హైదరాబాద్ రోడ్లపై మాట్లాడారు. భాగ్యనగరం రోడ్లు బహు బాగా ఉన్నాయని ఆ సమావేశంలో ఆమె ప్రస్తావించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వస్తుంటే తాను చూశానని హైదరాబాద్ రోడ్స్ చాలా చక్కగా అనిపించాయని ఆమె అన్నారు .
దీనికి సమాధానంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “హైదరాబాద్ మహానగర సిటీలో రోడ్లు బాగా లేవని చెప్పడానికి తాను సిగ్గుపడటం లేదని నిర్ద్వదంగా ఆయన అంగీకరించారు. పూర్తిస్థాయిలో రోడ్లను బాగుచేయడానికి కొంత సమయం పడుతుందని తేల్చి చెప్పారు .అక్కడితో ఆగకుండా మంత్రి కేటీ రామారావు తాను మంత్రివర్గంలో ఉన్నా తాము వీవీఐపీలమైనా తమ కుటుంబం కూడా ఇదే రోడ్లపై తిరగాల్సిందే అని ఆయన అన్నారు .ఇటివల తన కుమారుడు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడని కూడా ఈ సందర్భంగా తెలిపారు. రోడ్ల సమస్య తీర్చడానికి భారీ ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని, రిజల్ట్స్ కోసం కొంత సమయం వేచిచూడాలన్నారు.