టాలీవుడ్‌ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని తెలంగాణ ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ‘సిట్’ విచారణకు పిలవడం, ఈ కేసు ఇండస్ట్రీ ని ఒక కుదుపుకుదిపేయడం అందరికీ తెలిసిందే. విచారణ ఎదురుకున్న వారిలో యువ నటుడు నందు కూడా వున్నాడు. అయితే తాజాగా ఈ కేసుపై నందు భార్య , ప్రముఖ నటి గీతామాధురి స్పదించింది. నందూను డ్రగ్స్ కేసులో ఇంటరాగేషన్ కి పిలిచినప్పుడు ఎలా ఫీలయ్యారు అనే ప్రశ్నకు గీతా స్పందించారు.
నందూ ఎలాంటివాడో తనకి పూర్తిగా తెలుసనీ.. తన దగ్గర ఆయన ఏ విషయాలను దాచడని చెప్పింది. నందూపై తనకి పూర్తిగా నమ్మకం ఉండటం వలన, ఎంత మాత్రం భయం లేకుండా ధైర్యంగా వున్నానని, అయితే అసలు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ కేసు విషయంలో నందూ పేరు వినిపించడం, తన అత్తింటివారికి బాధను కలిగించిందని, నిప్పులేకపోయినా పొగ వస్తుందనే విషయం ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి తనకి అర్థమైందని చెప్పుకొచ్చింది గీతామాధురి .