డేరా సచ్ఛాసౌధా అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకు తమ విచారణలో షాక్ తినే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి డేరా బాబా ఏకంగా 400 మంది నపుంసకులుగా మార్చినట్లు ఇప్పటి దాకా జరిగిన విచారణలో తేలింది. డేరా బాబా అనుచరుడు హంసరాజ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణను ప్రారంభించిన సీబీఐ.. డేరాలోని డాక్టర్లే వీరిందరికీ చికిత్సలు చేశారని గుర్తించారు.
ఈ క్రమంలోనే డేరా బాబా పీఏ రాకేష్.. న్యాయసలహాదారు దాస్‌లకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా వారిద్దరికీ వృషణాలు లేవని తేలింది. దీంతో, మరింత సీరియస్‌గా ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయడం ప్రారంభించింది. డేరాలో స్త్రీలనందరినీ శృంగారానికి వాడుకునే బాబా.. పురుషలను మాత్రం నపుంసకులుగా మార్చేవాడని తమ దర్యాప్తులో పక్కా ఆధారాలతో తేలిందని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకెన్ని డేరా-ఘోరాలు బయటకు వస్తాయో అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.