2019 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 110 సీట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెల్సిందే..అప్పుడు వరుసగా ఉప ఎన్నికల్లో గెలిచిన ఊపులో టీఆర్ఎస్‌కు 110 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఇటీవల జరిగిన టీఆర్ఎస్వీ సమావేశంలో మరోసారి 2019 ఎన్నికల గురించి మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీకి 80 సీట్లు వస్తాయని, ఇంకాస్త కష్టపడితే మిగిలిన స్థానాలు కూడా కష్టం కాదని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి స్పందించారు.రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచే సీట్లు 110 నుంచి 50కి తగ్గాయని ..ఇది నేను అంటున్న మాట కాదని..స్వయాన సీఎం కేసీఆర్ లెక్కే అని ఎద్దేవా చేశారు. గతంలో 110 సీట్లు గెలుస్తామన్న ఇప్పుడు 50 సీట్లు వస్తాయని అనడంతో వారి ప్రతిష్ట ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చిని అన్నారు. అయితే చిన్నారెడ్డి కేసీఆర్‌పై బురద జల్లాలనే ఉత్సాహంతో లెక్కలు తప్పుగా చూపారు..అసలు కేసీఆర్ అన్నది 80 సీట్లు..వచ్చే ఎన్నికల్లో 80 సీట్లు గెలిస్తే తిరుగులేని మెజారిటీ అనే చెప్పాలి. అదే జరిగితే ఇప్పుడున్న కాంగ్రెస్ బలం ఇంకా తగ్గినట్లవుతుంది. అది దాచిపెట్టి 50 సీట్లే అని తప్పుడు లెక్క చెప్పి కేసీఆర్ సర్కార్‌పై బురద జల్లుతున్న చిన్నారెడ్డి అతి తెలివి తేటలు చూసి ఈ కాంగ్రెస్ నాయకులకు ఎప్పటికీ సిగ్గురాదు అని టీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి..విమర్శించినా అర్థరహితంగా ఉండాలి..టీ కాంగ్రెస్ నాయకులు ఇలా అర్థరహిత విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిలో ఇంకా దిగజారిపోతున్నారనడంలో సందేహం లేదు..
