Home / MOVIES / బాలివుడ్‌ పద్మావతి.. టాలివుడ్‌ బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేస్తుందా..?

బాలివుడ్‌ పద్మావతి.. టాలివుడ్‌ బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేస్తుందా..?

బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా పద్మావతి. దీపికా పడుకోన్, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భారీ తనం, మేకింగ్ విలువలు, అద్భుతమైన గ్రాఫిక్స్, భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాలతో నిండిన ట్రైలర్‌తో విడుదలకు ముందే ప‌ద్మావ‌తి చిత్రం భారీ హైప్ ను దక్కించుకుంది. చారిత్రక నేపథ్యమున్న సినిమాలు తీయడంలో.. బాలీవుడ్‌లో తనకు తిరుగులేదని ఇప్పటికే నిరూపించుకున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలు దక్షిణాదిలోనూ మంచి పేరుతెచ్చుకుని భారీ వసూళ్లు సాధించాయి. ఆయ‌న నుండి వచ్చిన గ‌త చిత్రాలు గోలీయోంకీ రాస్ లీలా-రామ్ లీలా, బాజీరావు మస్తానీ సినిమాలు ఆయన ప్రెస్టేజ్ ను మరింత పెంచాయి. లేటెస్ట్ గా పద్మావతి సినిమాను మరింత కసిగా రూపొందించాడు భన్సాలీ. మూవీతో అతిపెద్ద హిట్ కొట్టాలన్న దర్శకుడి ఉద్దేశం సినిమా ట్రైలర్ లో కనిపిస్తుంది.

ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా బాహుబలి- ద కంక్లూజన్ సినిమా నిలిచింది. ఓ దక్షిణాది సినిమా అంతపెద్ద హిట్ కావడం బాలీవుడ్ ఫిలిం మేకర్స్‌కు ప్రెస్టిజియస్ ఇష్యూగా మారింది. స్పోర్టింగ్ స్పిరిట్ ఎంత చూపించినప్పటికీ.. ఎక్కువ మంది ఆదరించే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఓ సినిమాను ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలబెట్టాలన్న తపన అక్కడి ఫిలిం మేకర్స్ లో పెరిగింది. యాక్షన్, రొమాన్స్, రాజరికం, వ్యూహాలు, కుట్రలు లాంటి అన్ని కోణాలు ఉన్న చారిత్రక కథాంశమే.. పద్మావతి సినిమా ఇతివృత్తం. దీంతో బీ టౌన్ బ్యాచ్ అంతా ప‌ద్మావ‌తి చిత్రం బాహుబ‌లి-2 కి ధీటుగా నిల‌బడుతుంద‌ని చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, అగ్ర నటులు, విమర్శకులు అందరూ పద్మావతి ట్రైలర్ పై ప్రశంసల జడివాన కురిపిస్తున్నారు. వండ్రఫుల్, నెవర్ బిఫోర్, స్టన్నింగ్, స్పెక్టాక్యులర్, మైండ్ బ్లోయింగ్ అంటూ.. తమ తమ సోషల్ ప్లాట్ ఫామ్ లలో పోస్టులు, రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ స్పందనే.. పద్మావతి సినిమాకు భారీ హైప్ ను ఆటోమేటిగ్గా క్రియేట్ చేస్తోంది. జ‌క్క‌న్న చెక్కిన బాహుబ‌లి-2 చిత్ర రికార్డుల్ని బీట్ చేస్తుందా.. లేదా అనేది తెలియాలంటే డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వ‌ర‌కు ఆగాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat