అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని హీరోయిన్ అనుష్క తన సందేశం వినిపిచింది. ప్రపంచంలోని ఆడపిల్లలందరినీ ఉద్దేశిస్తూ ఓ ప్రత్యేక సందేశాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసింది. సమాజంలో ఆడపిల్లల హక్కు కోసం మనమంతా శ్రమిద్దాం. భూమ్మీదప్రతి ఆడపిల్లకి తాను క్షేమంగా ఉండాలని, చదువుకోవాలని, సమాన హక్కులు ఉండాలని కోరుకునే హక్కు ఉంటుంది.
హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అని తన సందేశం వినిపించింది స్వీటీ. అలాగే ఈ సందర్భంగా ఓ చిన్నారితో కలిసి ఆప్యాయంగా దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. బాహుబలి తర్వాత అనుష్క ప్రస్తుతం భాగమతి చిత్రంలో నటిస్తోంది. జి.అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2018 జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.